Song Cover Image

తాళ్లపాక అన్నమాచార్య - నేనై విడువవద్దు

నేనై విడువవద్దు తానై తగులవద్దు తానే తానై వుంటే తగులెల్ల నూడు నేనై విడువవద్దు తానై తగులవద్దు తానే తానై వుంటే తగులెల్ల నూడు తానే తానై వుంటే తగులెల్ల నూడు పొద్దు వొద్దు హరి తలపున తలపోయగ వొద్దికైన పలుచేతలున్న వెల్లా మరచును పొద్దు వొద్దు హరి తలపున తలపోయగ వొద్దికైన పలుచేతలున్న వెల్లా మరచును నిద్దిరించువాని చేత నిమ్మ పంటివలెనే బుద్దితో కర్మములు గొబ్బున జారిపోవును నిద్దిరించువాని చేత నిమ్మ పంటివలెనే బుద్దితో కర్మములు గొబ్బున జారిపోవును నేనై విడువవద్దు తానై తగులవద్దు తానే తానై వుంటే తగులెల్ల నూడు తానే తానై వుంటే తగులెల్ల నూడు పలుమారు గురుసేవ బరగగా బరగగా చలివాసి ఆత్మ విజ్ఞానము బొడచూపు పలుమారు గురుసేవ బరగగా బరగగా చలివాసి ఆత్మ విజ్ఞానము బొడచూపు కలగన్నవాడు మేలుకనిన కలవలెనే పలుసంసారము లెల్ల భావనలై యుండును కలగన్నవాడు మేలుకనిన కలవలెనే పలుసంసారము లెల్ల భావనలై యుండును నేనై విడువవద్దు తానై తగులవద్దు తానే తానై వుంటే తగులెల్ల నూడు తానే తానై వుంటే తగులెల్ల నూడు పక్కన శ్రీ వేంకటేశుపై భక్తి వొడమగా అక్కజపు ఇహపరాలు అరచేతివి యౌను పక్కన శ్రీ వేంకటేశుపై భక్తి వొడమగా అక్కజపు ఇహపరాలు అరచేతివి యౌను చొక్కపు పరుసమంటి సొంపుగాని లోహము నిక్క బైడై నట్టు నెరుసెల్ల తొలగును చొక్కపు పరుసమంటి సొంపుగాని లోహము నిక్క బైడై నట్టు నెరుసెల్ల తొలగును నేనై విడువవద్దు తానై తగులవద్దు తానే తానై వుంటే తగులెల్ల నూడు నేనై విడువవద్దు తానై తగులవద్దు తానే తానై వుంటే తగులెల్ల నూడు తానే తానై వుంటే తగులెల్ల నూడు