Song Cover Image

శ్రమ మన ఆయుధం

జయ జయ జయ భారతమాత … జయ జయ జయ జయహే.. జయ జయ జయ త్రివర్ణ జండా... జయ జయ జయ జయహే... ... రైతన్నలు బాగుండాలి.. సైనికుల క్షేమం కావాలి... కార్మికులు ఎదగాలి… యువత చేతుల్లో భవిష్యత్తు వెలగాలి! పల్లె నుంచి పట్టణం వరకు ప్రగతి బాటలు వేయాలి, ప్రతి చేతికి పని ఇచ్చే స్వర్ణ భారతం కావాలి! జయ జయ జయ భారతమాత … జయ జయ జయ జయహే.. జయ జయ జయ త్రివర్ణ జండా... జయ జయ జయ జయహే... ... ... పరిశ్రమలు పెరగాలి, కొత్త కలలు పండాలి, మన దేశంలో తయారైన వస్తువులు ప్రపంచమంతా చేరాలి! నౌకలు నిర్మిద్దాం, యంత్రాలు తయారు చేద్దాం, విజ్ఞాన సాంకేతిక శక్తితో భారతాన్ని ముందుకు నడిపిద్దాం! ... జయ జయ జయ భారతమాత … జయ జయ జయ జయహే.. జయ జయ జయ త్రివర్ణ జెండా... జయ జయ జయ జయహే... ... పాఠశాలలో జ్ఞానం, ప్రయోగశాలలో విజ్ఞానం, యువతలో నైపుణ్యం— ఇదే భారత బలం! ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు సృష్టిద్దాం, మన శ్రమతో మన దేశాన్ని ప్రపంచ శిఖరాలకు చేర్చుదాం! ... ఒక్క జెండా… ఒక్క దేశం… ఒక్కటిగా మన భారతం! శాంతి మన బలం… శ్రమ మన ఆయుధం… అభివృద్ధి మన సంకల్పం! .. జయ జయ జయ భారతమాత … జయ జయ జయ జయహే.. జయ జయ జయ త్రివర్ణ జండా.. జయ జయ జయ జయహే... ఈ పాట రచన కింతలి సన్యాసి రావు.